Saturday, 18 April 2026 05:14:40 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఈ ‘సారీ’ బతుకమ్మ చీరలు లేనట్లే!

ప్రభుత్వం ఈ పండుగకు కూడా బతుక మ్మ చీరలు ఇవ్వడం అసాధ్యమేనని తెలుస్తున్నది. బుధవారం బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క చేసిన

Date : 25 September 2025 09:25 AM Views : 209

Abhi9 News - తెలంగాణ / Hyderabad : ప్రభుత్వం ఈ పండుగకు కూడా బతుక మ్మ చీరలు ఇవ్వడం అసాధ్యమేనని తెలుస్తున్నది. బుధవారం బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అద్భుతమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం భా వించిందని, చేనేత కళాకారులు సకాలం లో అందించలేకపోతున్నారని ఆమె పే ర్కొన్నారు. త్వరలోనే మహిళా పొదుపు సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. 8 ఏండ్ల పాటు నిరాటకంగా కొనసాగిన బతుకమ్మ చీరల పంపిణీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది. మంత్రుల సమావేశంలో కరెంట్‌ కట్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన మహిళాభవన్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు వందలాదిమంది మహిళలు, స్థానికులు పాల్గొన్న ఈ సమావేశంలో 20 నిమిషాల పాటు కరెంట్‌ కట్‌ అయ్యింది. దీంతో స్థానిక విద్యుత్‌ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అసహనం వ్యక్తం చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :