Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో రాత్రి సమయంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత రాత్రి పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి చంపేసింది .ఉదయం లేచి చూచిన స్థానికులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు.సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో ఇటీవల తరచుగా చిరుత రాత్రి సమయంలో వస్తుందని బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ చిరుతను బంధించాలని స్థానిక డబల్ బెడ్ రూమ్ వాసులు కొరుతున్నారు...
Admin
Abhi9 News