Saturday, 18 April 2026 06:41:36 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మహిళా స్వయం సహాయక సంఘాల లో (ఎస్.హెచ్.జి) లలో చేరకుండా బయట ఉన్న మహిళలను సభ్యులుగా చేర్పించాలి

Date : 10 June 2025 08:41 PM Views : 145

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహిళా స్వయం సహాయక సంఘాల లో (ఎస్.హెచ్.జి) లలో చేరకుండా బయట ఉన్న మహిళలను సభ్యులుగా చేర్పించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి. ఓ.లు,ఎం.పి. ఓ.లు, ఏ.పి.ఎం.లు,గృహ నిర్మాణ శాఖ డి. ఈ.లు, ఏ. ఈ.లతో విబెక్స్ నిర్వహించి మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు,ఉపాధి హామీ వేతనం,నర్సరీలు,వయోజన విద్య ఉల్లాస్ ద్వారా వాలంటీర్లు,నిరక్ష్య రాస్యులు గుర్తింపు,పి.ఎం.విశ్వ కర్మ,స్కూల్ యూనిఫాం స్టిచింగ్,ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలు సమీక్షించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరు లోగా మహిళా స్వయం సహాయక సంఘాల లో నూరు శాతం మహిళలును చేర్పించాలని అన్నారు. ప్రతి గ్రామ సంఘం pwd, సీనియర్ సిటిజన్ ఎస్.హెచ్.జి.ఏర్పాటుచేయాలని సూచించారు. వయోజన విద్య ఉల్లాస్ కార్యక్రమంలో 64000 మంది ఎస్ ఎస్ జి గ్ నిరక్ష రాస్యులైన మహిళలను చదవడం, రాయడం నేర్పించేందుకు 22 వేల మంది మహిళలు సమాచారం అందించారని,మిగతా లక్ష్యం ప్రకారం మహిళలు సమాచారం అదేవిధంగా వాలంటీర్లను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మర్లో పంపించాలని అన్నారు మండలం కు 3 వేల మంది ఎస్.హెచ్.జి.నిరక్షరాస్యులు ను గుర్తించాలని అన్నారు కొత్తగా ఏర్పడిన ఎస్.హెచ్.జి లీడర్ లకు శిక్షణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్నారు. బ్యాంక్ లింకేజి కింద 385 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 94 కోట్ల రూ.లు ఇవ్వాల్సి ఉండగా 15 కోట్ల రూ.లు మాత్రమే పూర్తి అయిందని,బ్యాంక్ లింకేజీ కింద రుణ లక్ష్యం పూర్తి చేసేలా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు వేతనం తక్కువగా ఉందని,వారికి సరైన కొలతలతో పని ఇచ్చి వేతనం పెంచాలని అన్నారు.ముఖ్యంగా మహబూబ్ నగర్,కోయిల్ కొండ,హన్వాడ,మూసా పేట మండలం సరాసరి వేతనం చాలా తక్కువ ఉందని అన్నారు. నర్సరీలు,మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 17 వరకు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నేడు అంగన్వాడి లు పునః ప్రారంభం అవుతాయని, ఈ నెల 12 న పాఠశాలలు కూడా తిరిగి ప్రారంభం కానున్నట్లు,పాఠశాలలు,అంగన్వాడి లు పారిశుధ్యం చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. 3+ సంవత్సరం ల వయస్సు ఉన్న పిల్లలను అంగన్వాడీ లలో,5+ వయస్సు పిల్లలను బడి బాట కార్యక్రమం ద్వారా పాఠశాలలో చేర్పించాలని అన్నారు. నేడు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం లో ఎం.పి.డి. ఓ.లు పాల్గొని పండుగ వాతావరణం లో నిర్వహించాలని అన్నారు. పి.ఎం.విశ్వ కర్మ ద్వారా జిల్లాలో 17 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు,వాటిని పరిశీలించి పంచాయతీ కార్యదర్శులు ఆన్ లైన్ లో పంపించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం లో వివిధ దశలలో జిల్లాలో 187 మందికి నిధులు విడు దాల చేసినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన వాటిని త్వరగా గ్రౌండింగ్ చేయాలని అన్నారు. మండల స్థాయి లో ధరల కమిటీ లు మేస్త్రీ,ఇతర చార్జీలు ఎక్కువ లేకుండా చూడాలని అన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,డి.అర్.డి. ఓ నర్సింహులు,గృహ నిర్మాణ పి.డి.వైద్యం భాస్కర్,పరిశ్రమల శాఖ జి.ఎం.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :