Abhi9 News - క్రైమ్ వార్తలు / నారాయణపేట : మక్తల్ పురపాలక ఎన్నికల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాదేవప్ప ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారం ముగిసి, పోలింగ్కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
Abhi9 News