Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తంలో లో వోల్టేజ్ తో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయేవి, జీవితాంతం మోటార్ల రిపేర్, కరెంటు కోసం రైతులు ఎదురుచూపులు చూసేవారు అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.. మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం ఓబులాయపల్లి రైతు వేదికలో రైతుబంధు సమితి ఆధ్వర్యంలో మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ రైతుల అవగాహన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో పడిన రైతుల కష్టాలు స్వయంగా రైతులతో మాట్లాడించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవని, కానీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు.. మూడు గంటల కరెంటు చాలు కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పాలన కావాలా ఆలోచించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.. మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరి పొలిమేరలో ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..ఇలాంటి నాయకులకు సరైన బుద్ధి చెప్పాలని రైతులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
Admin
Abhi9 News