Saturday, 18 April 2026 06:45:15 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రత్యర్థి వ్యూహన్నే అస్త్రంగా సంధిస్తే..! గతానికి భిన్నంగా 'హస్తం' అడుగులు

Date : 28 June 2023 06:47 PM Views : 220

Abhi9 News - తెలంగాణ / Hyderabad : మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో ఎన్నికల సమరం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లాయి. ఎవరికి వారిగా గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి.ఏ మాత్రం తేడా అనిపించినా... పక్కనపెట్టేస్తూ కొత్త వారి కోసం అన్వేషించే పనిలో పడ్డాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణను కొట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం....గతానికి భిన్నంగా అడుగులు వేసే ఆలోచనలో ఉంది. అధికారికంగా ఎన్నికల సమరశంఖం పూరించకముందే.... 50 శాతానికిపైగా అభ్యర్థులను ప్రకటించాలి చూస్తోంది. ఫలితంగా బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వటంతో పాటు.... ఎన్నికల యుద్ధంలో తాడేపేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా హైకమాండ్.... రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీట్లపై క్లారిటీ.... రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. మొదటగా ఎక్కడైతే వివాదాలు లేకుండా... నేతల మధ్య సమన్వయం ఉన్న సీట్లను గుర్తించే పనిలో పడింది. దాదాపు ఈ ప్రక్రియ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో 60 నుంచి 70 సీట్లు ఉన్నట్లు టీ కాంగ్రెస్ భావిస్తోంది. విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.... ప్రకటిస్తే బెటర్ అనే భావనకు రాష్ట్ర కాంగ్రెస్ వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా... త్వరలోనే ఆమోదం లభించే అవకాశం కూడా ఉందట. అన్ని కుదిరితే జులై మాసంలోనే తొలి జాబితాలో భాగంగా... వీరందరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా సీట్లలోని నేతలు..... గ్రౌండ్ పై మరింత ఫోకస్ చేయటంతో పాటు... బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కేసీఆర్ స్టైల్ లోనే.... 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్... ప్రతిపక్షాలకు ఉపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదనే చెప్పొచ్చు. శాసనసభను రద్దు చేయటం... ఆ వెంటనే 90 మందికిపైగా అభ్యర్థుల జాబితాను ప్రకటించటం వంటిని వెనువెంటనే జరిగిపోయాయి. ఇదంతా కూడా కేసీఆర్ ఓ ప్లాన్ ప్రకారం చేసేశారు. ఊహించని ఫలితం కంటే.... ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల విషయంలోనూ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మాసంలోనే 70 నుంచి 80 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.... కాంగ్రెస్ కూడా ముందస్తుగానే జాబితాను ప్రకటించి... అధికార బీఆర్ఎస్ కు ఓ సవాల్ విసరాలని చూస్తోంది. ఫలితంగా ఆయా సీట్లలో హోరాహోరీ వాతావరణం నెలకొల్పే దిశగా కార్యాచరణను సిద్ధం చేయాలని చూస్తోంది. కేసీఆర్ స్టైల్ లోనే....రివర్స్ షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఎన్నికలు అంటే చాలు... సర్వేలే చుట్టే తిరిగేస్తారు కేసీఆర్. దానిబట్టి ఎంపిక ఉంటుందని స్పష్టంగా చెప్పేస్తారు. వచ్చే ఎన్నికల విషయంలోనూ అదే ప్రాతిపాదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఇప్పటికే చెప్పారు. ఇక కాంగ్రెస్ కూడా.... సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయబోతుంది. మొత్తం 3 రకాల సర్వేలు జరుగుతున్నాయని.. వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆశావాహులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. నామినేషన్ల పర్వం అయ్యే నాటికి కూడా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూశాం. 2014, 2018 ఎన్నికల్లోనూ సుదీర్ఘ కసరత్తే నడిచింది. అయితే ఈసారి అలా కాకుండా.. ముందస్తుగానే రేసు గుర్రాలను ప్రకటించి.. కారు స్పీడ్ కు బ్రేకులు వేయాలని చూస్తోంది. నిజంగానే.. గతానికి భిన్నంగా మెజార్టీ అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటిస్తారా.? లేక గతంలో మాదిరిగా ఎన్నికల వేళనే అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి..!

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :