Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : బిజినేపల్లి మండలం పాలెం లో ఓ ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల విద్యార్థిని పై టీచర్ ఓవరాక్షన్ చేసింది. అక్షరాలు దిద్దడం లేదని మూడేళ్ల చిన్నారి చెంప చెల్లుమనిపించింది. దీంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బిజినేపల్లి మండలం పాలెం లోని శ్రీ గాయత్రి పాఠశాలలో మూడేళ్ల చిన్నారి గణ నేత్ర నర్సరీ చదువుతున్నాడు. అక్షరాలు సరిగ్గా దిద్దక కపోవడంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు ఘననేత్ర చెంపలపై కొట్టింది. దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థి స్పృహ తప్పడు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని బాలుడిని అక్కున చేర్చుకున్నారు. తర్వాత ఉపాధ్యాయులతో వాదనకు దిగారు. పసిబిడ్డపై ఇలాంటి చర్యలు ఏమిటని మండిపడ్డారు. ఇది పద్ధతి కాదని ఆగ్రహించారు. తర్వాత పాఠశాల యాజమాన్యం స్పందించి సదరు ఉపాధ్యాయురాలిని పాఠశాల నుండి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
Admin
Abhi9 News