Saturday, 18 April 2026 05:14:40 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బీసీలపై కుట్రలను సహించం

బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి&ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్

Date : 10 October 2025 11:48 PM Views : 198

Abhi9 News - తెలంగాణ / Hyderabad : స్థానిక సంస్థల ఎన్నికలకు అలాగే 42% రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే విధించడాన్నీ నిరసిస్తూ బీసీ సమాజ్ మరియు బీసీ కుల సంఘాలు,ప్రజాసంఘాలు ,విద్యార్థి సంఘాలు, మేధావుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేకుండా ముందుకు వెళ్లి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు మరియు బీసీ రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే విధించే వరకు తీసుకువచ్చిందని అన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప చట్టబద్ధత ఉండదని మొదటి నుంచి చెప్తూ ఉన్నామని కాని ఆ విషయంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేసేందుకే ప్రయత్నం చేశాయని శ్రీనివాస్ సాగర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల అధినాయకత్వం మొత్తం అగ్రవర్ణ చేతిలో ఉంది కాబట్టి బీసీల 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ,బిజెపి, బిఆర్ఎస్ బీసీలను ఓటు బ్యాంకు గానే వాడుకునేందుకే చూస్తున్నారు తప్ప చట్టసభల్లో బీసీ లకు తగు ప్రాతినిధ్యం కల్పించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికపరంగా ముందుకు తీసుకు వెళ్దామనే కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినట్లుగా 42% రిజర్వేషన్ల తర్వాతనే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నేను పక్షంలో బీసీలందరూ ఐక్యమత్యంతో మన ఓటు మనకే వేసుకుందాం అని నిదానంతో ముందుకెళ్లి రేపు జనరల్ స్థానాలలో కూడా బీసీలు నిలబెట్టి బీసీల సత్తా చాటుతామని శ్రీనివాస్ సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, విశ్రాంత డిఇఓ విజయ్ కుమార్ ,రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, జిల్లా ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డీకే నాయి, రజక సంఘం పాలమూరు అధ్యక్షుడు దుర్గేష్, పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ సాగర్, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, నాయి బ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, సెక్రటరీ మల్లేపల్లి నరసింహులు, బీసీ సమాజ్ బూత్పూర్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, తెలంగాణ ఉద్యమ కారుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శివన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు రవి ముదిరాజ్, బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు పిల్లి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గొల్ల ఆంజనేయులు, బాలరాజు, సుధాకర్, చంద్రమౌళి,వీరప్ప, భాస్కర్,నాగప్ప,ఆంజనేయులు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :