Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో పాటు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బిజెపి ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. సభ విజయవంతానికి బిజెపి నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుండి కార్యకర్తలను, ప్రజలను భారీగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు దిలీప్ ఆచారి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండా మన్నెమ్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేదిక ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రేపు సాయంత్రం కార్యక్రమానికి హాజరై సభ వేదిక నుండి ప్రసంగించి సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు.
Admin
Abhi9 News