Saturday, 18 April 2026 06:51:59 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల

Date : 24 December 2025 05:54 PM Views : 261

Abhi9 News - తెలంగాణ / Hyderabad : గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. సర్పంచ్‌లకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. సర్పంచ్‌లకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఇస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారాయన. అలాగే గ్రామాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తాని సీఎం ప్రకటించారు. ‘మీ సహకారం వల్లే నేను ఇంతటివాడిని అయ్యాను. 2009 నుంచి నన్ను మీ భుజాలపై మోశారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాల్లో వివక్ష లేకుండా పరిపాలన సాగాలి. పార్టీలు.. పంతాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలి. గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా సర్పంచ్‌లు ఉండాలి. ప్రజలకు ఉన్నతమైన, నాణ్యమైన సేవలు అందించాలి. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి కావాలి.’ అని నూతన సర్పంచ్‌లకు సూచించారు సీఎం రేవంత్.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :