Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 29 June 2023 11:11 AM Views : 241

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు స్థానిక కొత్త గంజి సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... బక్రీద్‌ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని మంత్రి తెలిపారు. బక్రీద్ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలన్నీ సుఖసంతోషాలతో జరుపుకుంటున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ లో పండుగలప్పుడు స్నానం చేసేందుకు నీళ్లు కూడా లభించే పరిస్థితి ఉండేది కాదని... రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరాయన్నారు. ఎన్నికలప్పుడు పండుగలు వచ్చాయంటే ఎప్పుడు ఏ ఆందోళన జరుగుతుందోనని భయం భయంగా ఉండేదని... ఇప్పుడు హిందూ ముస్లిం భాయి భాయి అన్న తీరుగా పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేశామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలోఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్పీ కె నరసింహ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎస్పీ మహేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :