Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సమావేశంకు (Annual General Body Meeting) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రాష్ట్రపతి భవనులోని కల్చరల్ సెంటరులో నిర్వహించగా రాష్ట్రపతి చేతులు మీదుగా లయన్. డాక్టర్. ఏ. నటరాజుకు బంగారు పతకాన్ని అందుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా నటరాజ్ చేస్తోన్న సమాజ సేవకు గుర్తింపుగా ఈ బంగారు పతకాన్ని అందించడం జరిగింది. దేశ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీలో ఇద్దరికీ మాత్రమే ఈ బంగారు పతకాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ 100 ఏళ్లకు పైగా ప్రజలకు సేవ చేస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మన్సుక్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖామత్రి తమిలసై, బందరు దత్తాత్రేయతో పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ తరపున చైర్మన్ అజయ్ మిశ్రా, జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావు, జాతీయ కమిటీ సభ్యులు విజయ్ చందర్ రెడ్డి హాజరయ్యారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పథకం అందుకోన్న లయన్. డాక్టర్. ఏ. నటరాజ్ 32 ఏళ్లుగా సమాజానికి చేసిన సేవలు... డాక్టర్ ఏ. నటరాజ్ నగర్ కర్నూల్ పట్టణంలో స్వాతంత్ర్య సమర యోధుడు ఏ. చంద్ర శేఖర్ మరియు గౌరమ్మలకు 02.07.1956లో జన్మించారు . ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1990 నుంచి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందిస్తున్నారు.... గతంలో పాలమూరు మాజీ కలెక్టర్ అనంత రాములు ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ కమిటీలో 3 ఏళ్లపాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత 2002లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గవర్నర్ రంగ రాజన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. అంతటితో ఆగకుండా కేవలం అయిదు ఏళ్లలో అంటే 2007లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పడి వేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయించడంతో, రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని నేటికీ 2023 వరకు కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. 2005లో నాటి కలెక్టర్ మధుసూధన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టి సన్నిధి పేరుతో ఓ అనాధ శరణాలయం ఏర్పాటు చేసి నేటికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడం జరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాస్కులు, సానిటైజేశన్, తాగునీరు, ఆహారం, ఎనర్జీ డ్రింక్స్ సరఫరా చేయడం జరిగింది. గుర్తు తెలియని శవాలు అలాగే కరోనా సమయంలో పరమపదించిన దాదాపు 48 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కరోన సమయం నుంచి సతీమణి కల్యాణి ఫౌండేషన్ పేరుతో ప్రతి ఏడాది బియ్యం, పప్పులు కిట్స్ 1000 మందికి అందిస్తున్నారు. 2018లో ఉమ్మడి పాలమూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ గా భాద్యతలు చేపట్టడం జరిగింది. మెంటల్ ఛాలెంజ్ చిన్నారులకు శాంతి వనం రెసిడెన్షియల్ పాఠశాల మరియు 2019లో మూగ చెవిటి విద్యార్థులకు అక్షర పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. స్వామి వివేకానంద ట్రస్ట్ అలాగే రెడ్ క్రాస్ కలిసి ఉమ్మడి పాలమూరులో 15 ఏళ్లుగా ప్రతి ఏడాది లక్ష నోటు బుక్కులు పేద విద్యార్థులకు అందించడం జరుగుతోంది. 2018 నుంచి ప్రతి ఏడాది రెడ్ క్రాస్ చైర్మన్ హోదాలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ 5వేలు అందిస్తున్నారు. వికలాంగులకు ట్రై సైకిల్స్, కాలిబర్స్, కృత్రిమ కాళ్లు, చేతులు కూడా అవసరమైన సమయంలో అందిస్తున్నారు. 2021 నుంచి 2023 వరకు గత మూడేళ్లుగా NEET లో ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులను ఎంపిక చేసి ముగ్గురికి మెడిసిన్ చదివేందుకు ఆర్థిక సహాయం పూర్తిగా అందించడం జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా సమయంలో ఆక్సిజన్ కంటైనర్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి వర్షాకాలంలో తార్పాల్స్, బ్లాంకెట్స్, హైజనిక్ కిట్స్ 50 వేల వరకు అండించడం జరుగుతోంది. అలాగే గత 5 ఏళ్లుగా మెడికల్ కాలేజీలకు 21 డెడ్ బాడీస్, నేత్రదానం కోసం దాదాపు 140 వరకు అంటే 280 మందికి నేత్రాల సౌకర్యం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఆరు మందితో ఆర్గాన్స్ డొనేషన్ చేయించడం జరిగింది. అలాగే రికార్డు స్ధాయిలో 1984 నుంచి 2023 నేటి వరకు 154 సార్లు రక్తదానం, ఆరు సార్లు ప్లాస్మా, ఆరు సార్లు ప్లేట్ లెట్స్ సొంతంగా ఇవ్వడం జరిగింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2002 నుంచి నేటి వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించి లక్ష 91 వేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయడంలో కృషి చేయడం జరిగింది.
Admin
Abhi9 News