Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం జడ్చర్ల లోని డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను సందర్శించారు. వీరికి కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. నర్మద స్వాగతం పలికారు. కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహిస్తున్న BLO ట్రైనింగ్ ను సందర్శించిన కలెక్టర్ అనంతరం డిగ్రీ తృతీయ సంవత్సరం BZC తరగతి గదిలోకి ప్రవేశించి కాసేపు అధ్యాపకురాలిగా మారారు. విద్యార్థుల ను పలు అంశాలపై ప్రశ్నలగిడి సమాధానాలు రాబట్టారు. అనంతరం విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ, స్వయం ఉపాధి, అనుకున్న విజయాలను ఎలా చేరుకోవాలి అనే అంశాలపై విద్యార్థుల కు అవగాహన కల్పించారు. విద్యార్థుల కు అవసరమైన కంప్యూటర్ లాబ్, స్వయం రక్షణ కోసం కరాటే లాంటి విద్యలు, పోటీ పరీక్షలు ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్ ప్రిపరేషన్ కు కావలసిన వసతులను ఏర్పాటు చేస్తామని అదేవిధంగా విద్యార్థుల కు డ్రైవింగ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. అనంతరం కళాశాలలో ని తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించారు. మొదటగా గార్డెన్ కు అనుబంధం గా ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ మరియు విద్యాకేంద్రం ను సందర్శించారు. కలెక్టర్ గారికి గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిల్వజేసిన ఇటీవల రక్షించిన పాములను చూశారు. అక్కడ భద్రపరచిన అతిపెద్ద జెర్రిపోతు కుబుసాన్ని చూసి ఆనందపడ్డారు. వీటి గురించి సదాశివయ్య ను ఆడిగి తెలుసుకున్నారు. తరువాత బొటానికల్ గార్డెన్ లో వివిధ విభాగాలను పరిశీలించి మొక్కను నాటి నీరు పోశారు. గార్డెన్ ఏర్పాటు చేసిన తీరును అభివృద్ధి చేస్తున్న సదాశివయ్య ను అభినందించారు. గార్డెన్ కి కావలసిన సహాయ సహకారాలు చేస్తామని తెలిపారు. గార్డెన్ లో దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్న నెట్ హౌస్ లను, ఆర్కిడ్ హౌస్, కాక్టస్ హౌస్ లను చూసి కలెక్టరేట్ ఆవరణలో ఇలాంటివి ఏర్పాటు చేయాలని సదాశివయ్య కు సూచించారు. విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించాలని అధ్యాపకులకు సూచించారు. కలెక్టర్ గారికి గార్డెన్ లో పండిన స్టార్ ఫ్రూట్స్ ను గార్డెన్ సమన్వయకర్త మరియు ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. నర్మద బహుమానం గా అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సి6 డా. నర్మద, అధ్యాపకులు డా. సదాశివయ్య, రాఘవేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాజేశ్వరి, వెంకట్ రెడ్డి, రజని తదితరులు ఉన్నారు.
Admin
Abhi9 News