Saturday, 18 April 2026 03:30:23 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు

Date : 09 February 2026 12:47 PM Views : 137

Abhi9 News - క్రైమ్ వార్తలు / : డ్రైవర్ నిర్లక్ష్యంలో ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో వెలుగు చూసింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో కానో నుండి గుజుంగు పట్టణం వైపు వెళ్తున్న ఓ ట్రక్కు సరిగ్గా క్వానార్ బార్డే పట్టణంలోని హైవే వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సుమారు 30 మంది ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని హస్పిటల్‌కు తరలించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ ప్రమాదంపై కానో గవర్నర్ కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని.. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ కానో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అలాగే, మరణాలను అంచనా వేసి, బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :