Saturday, 18 April 2026 06:46:12 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జులై 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పై డ్రోన్ షో

Date : 19 July 2023 12:01 PM Views : 435

Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఆర్ధికంగా అభివృద్ధి సాదించిన అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్వీడన్, నార్వే, స్పెయిన్, సింగపూర్, దుబాయ్, బీజింగ్ లాంటి పట్టణాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, సాంకేతికంగా నిర్వహించే డ్రోన్ షో తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మంగా దేశంలో మొట్టమొదటి సారిగా జులై 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏర్పాటు సమయంలో నిర్వహించిన డ్రోన్ షో ను జిల్లాల్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర IT, పరిశ్రమల శాఖల మంత్రి KTR గార్ల సహకారం తో ప్రపంచం లోని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో అత్యంత అరుదుగా నిర్వహించే డ్రోన్ షో తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు లో భాగంగా దేశంలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పైన ఈ నెల 23న నిర్వహిస్తున్నామని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సందర్భంగా వెల్లడించారు. మహబూబ్నగర్ పట్టణం లో డ్రోన్ షో నిర్వహించిన అనంతరం దశలవారీగా వివిధ జిల్లా లైనా వరంగల్, సిద్దిపేట, ఖమ్మం & నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామాయ్యర్ గారితో కలిసి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి , టూరిజం డైరెక్టర్ శ్రీమతి నిఖిల, పర్యాటక శాఖ ఎండి మనోహర్, Botlan Dynamics స్టార్ట్ అప్ కు చెందిన ఆయుష్, భాస్కర్, పర్యాటశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :