Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఈ రోజు జిల్లా ఎస్.పి శ్రీ కె నరసింహ గారు మహమ్మాదాబాద్ పోలీస్ స్టేషన్ నందు వార్షిక తనిఖీ లొ భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరిని కరచలనం చేసి పరిచయం చేసుకున్నారు అనంతరం పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ ఎస్పీ గారికి వివరించారు. అనంతరం ఎస్పీ అక్కడ మెంటైన్ చేస్తున్న రిజిస్టర్లు, CD ఫైల్లని చెక్ చేసి, అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, HRMS ఆన్ లైన్ వినియోగించు విధానము, TS COPs ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయు మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివరించి వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DSP మహేష్, DCRB DSP వెంకటరమణ రెడ్డి, SP సీసీ రాంరెడ్డి, రూరల్ ఇన్స్పెక్టర్ స్వామి, SI సురేష్ మరియు IT Cell సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Abhi9 News