Saturday, 18 April 2026 03:30:13 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ముఖ్యమంత్రి సహకారంతో మహబూబ్ నగర్ అభివృద్ధి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Date : 26 January 2026 08:23 AM Views : 155

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి దిశానిర్దేశం, సంపూర్ణ సహకారంతో మహబూబ్ నగర్ నగరంలో గత రెండు సంవత్సరాలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నగరంలోని అరుంధతి భవన్ లో అరుంధతి బంధు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, క్యాలెండర్ ను ఆవిష్కరించి, మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో మహబూబ్ నగర్ బిడ్డ కూర్చోవడం మన మహబూబ్ నగర్ అదృష్టమని, 75 సంవత్సరాల తరువాత భగవంతుడి అనుగ్రహంతో ఈ సువర్ణావకాశం లభించిందని అన్నారు. ఈ అవకాశాన్ని వృథా చేయకుండా మహబూబ్ నగర్ ను తెలంగాణలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో కేవలం రెండు సంవత్సరాల్లోనే మహబూబ్ నగర్ అభివృద్ధికి సుమారు రూ.2,000 కోట్ల నిధులు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా ఇంత భారీగా నిధులు ఇవ్వలేదన్నారు. కావున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతగా, మహబూబ్ నగర్ భవిష్యత్తుకు హామీగా, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 60 డివిజన్లలో కనీసం 50 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి కావాలంటే స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వానికి ప్రజల మద్దతు తప్పనిసరి అని అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి శాశ్వతంగా కొనసాగాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అండగా నిలవాలని, ఎమ్మెల్యేగా తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పీ. వెంకటేష్, అరుంధతి బంధు సేవా సమితి అధ్యక్షులు జుట్ల హన్మంతు, కార్యదర్శి లింగాల రాములు, నాయకులు డాక్టర్ రాంమోహన్, డాక్టర్ సామ్యెల్, డాక్టర్ విజయకాంత్, యాదయ్య, నవనీత, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :