Saturday, 18 April 2026 06:50:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం జడ్చర్లలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కోసం మొక్కలు నాటిన మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ

ముఖ్య అతిథిగా జిల్లాఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్

Date : 23 June 2025 01:28 PM Views : 174

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, జడ్చర్లలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకిముఖ్య అతిథిగా హాజరై పాఠశాల విద్యార్థులు మరియు యువత తో కలిసి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఎస్పీ మాదకద్రవ్యాల నిర్మూలన గురించి విద్యార్థులకు, యువతకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. *"మొక్కలు నాటి మీ మనసును బాగు చేసుకోండి... మాదకద్రవ్యాల జోలికి వెళ్ళకండి"* అనే నినాదంతో ఒక సామాజిక సందేశాన్ని అందించారు. "పర్యావరణ పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల నివారణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలి. యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అనివార్యమని" పేర్కొన్నారు. "యువత తమ భావోద్వేగాలను మాదకద్రవ్యాలవైపు మళ్లించకుండా ప్రకృతి వైపు మళ్ళించాలి. ప్రతి మొక్క మన భవిష్యత్తుకు ఆధారం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మనసును ప్రశాంతంగా మార్చుకోవాలి. మాదకద్రవ్యాలు మానవ జీవితాన్ని నాశనం చేసే వినాశకారక మార్గం. అలాంటి దారి వైపు అడుగుపెట్టకూడదు అని ప్రతి ఒక్కరూ పూనుకోవాలన్నారు." అలాగే, "మొక్కలు నాటే ప్రతి చేతి పని – మన సమాజాన్ని, మన పర్యావరణాన్ని, మన మనసును మంచివైపు మారుస్తుంది. అందువల్ల ఈ రోజు మనం అంతర్యాతగా ప్రమాణం చేయాలి – ‘మొక్కలు నాటుతాం... మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం’ అని." అని తెలిపారు. కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మహబూబ్ నగర్ ఇంచార్జి డీఎస్పీ బుచ్చయ్య, DTC డీఎస్పీ గిరిబాబు, AR డీఎస్పీ శ్రీనివాసులు, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, DTC ఇన్స్పెక్టర్ రవి కుమార్, RI అడ్మిన్ కృష్ణయ్య, DTC RI రమేష్, SI బాలానగర్, SI రాజపూర్, SI జడ్చర్ల, ప్రజలు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :