Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదం ఆ చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపింది.. బైక్ పై ప్రయానిస్తున్న ఆ దంపతులిద్దరూ ఓకే సారి ప్రాణాలు కోల్పోవడంతో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారారు..మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వడ్డె రాజు, అనంతమ్మ కు నలుగురు ఆడపిల్లలు సంతానం.. పెద్ద కూతురు కు విహాహం కావడంతో ముగ్గురు పిల్లలు అనిత, నందిని, నవనీత లు అనాదలుగా మారారు..అయితే వీరికి మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 2009 బ్యాచ్ S I's (AP &TS) వెల్ఫేర్ సొసైటీ వారి సహకారం తో 2లక్షల యాభై వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.. అలాగే గ్రామస్థుల సహకారంతో చిన్నారులకు అండగా ఉంటామని సి ఐ చల్లాపురం శ్రీనివాస్ రెడ్డి తెలియచేశారు..వీరితో పాటు మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు రామకృష్ణ తమ తోటి ఉపాధ్యాయులతో కలిసి మరో యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు..తమ గ్రామంలో విషాద సంఘటన జరగడం బాధాకరమని చిన్నారులను ఉన్నత చదువులు చదివించి వారికి అండగా ఉంటామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు..
Admin
Abhi9 News