Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సాయిచంద్ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. అర్దరాత్రి సమయంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నాగర్‌కర్నూల్‌లోని గాయత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగానే గుండెపోటుకు గురయ్యారు. అయితే సాయిచంద్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన భార్య రజనీ కోరడంతో వెంటనే హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు బీఆర్ఎస్ నేత సాయిచంద్ గుండె పోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సాయిచంద్ మృతిపట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం, పార్టీ నేతల్లో పోరాట స్పూర్తిని కలిగిస్తూ వచ్చిన సాయిచంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు.నాగర్‌కర్నూల్ జిల్లాలోని తన ఫామ్‌కి కుటుంబ సభ్యులతో వెళ్లిన సాయిచంద్ బుధవారం అర్దరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికి ప్రయోజనం లేకపోయింది. అయితే బిజినపల్లి మండలం కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో గుండెపోటుకు గురైన సాయిచంద్‌ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులుల తెలిపారు...
Admin
Abhi9 News