Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : భాజపా తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి కార్యక్రమం, భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గురువారం మరికల్ మండల కేంద్రంలో ఇంటింటి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా మరికెల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు కే.నరసన్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో ప్రజలు సురక్షంగా ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించిన ఘనత బిజెపి పార్టీకే దక్కిందన్నారు.భాజపా తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మరికల్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి, నారా కొండయ్య,మండల బిజెపి పార్టీ అధ్యక్షులు బండగొండ భాస్కర్ రెడ్డి, బిజెపి మండల నాయకులు ఎం వేణుగోపాల్, అప్పంపల్లి గ్రామ సర్పంచ్ తిరుపతిరెడ్డి, మరికల్ బిజెపి పట్టణ యూత్ నాయకులు రమేష్, మండల కిషన్ మోర్చా అధ్యక్షులు కురుమన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News