Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ మండల పరిధిలోని , టంకర గ్రామం ,బ్యాత్నమోని అనంతయ్య, తండ్రి బి .వెంకటయ్య, గ్రామం టంకర , వాసి అయిన తన భూమి సర్వే నంబర్లు 115 ఉ1,115ఉ2, 115/1/2/1/2, ఎందు మొత్తము (ఒక ఎకరా 22 గుంటలు) కలదని అట్టి భూమి , నేను బ్రతకడానికి వేరే ప్రాంతంలో ఉన్న సమయంలో మా సొంత అన్నయ్య బ్యాత్నమోని అంజిలయ్య తండ్రి బి.వెంకటయ్య, గ్రామం టంకర వాసి అయిన వారు ,నా యొక్క భూమిని కబ్జా చేసుకుని దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ,అడగడానికి వెళితే నీది ఎక్కడి భూమి , భూమి లేదు గీమి లేదు వెళ్ళిపో, అంటూ దౌర్జన్యంగా మా అన్నయ్య , మరియు వారి పిల్లలు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ భూమి యొక్క పాసు పుస్తకము నా దగ్గర ఉన్నదని మరియు ఈసీ ,కాస్ర పహాని,తదితర అన్ని కాగితాలు తన వద్ద ఉన్నాయని ,అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు వేస్తున్న రైతుబంధు కూడా ప్రతి సంవత్సరం తన ఖాతాలో పడతా ఉన్నదని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న రెండు వేల రూపాయలు తన ఖాతాలో పడుతున్నాయని తెలియజేశారు . ఈ విషయమై స్థానిక మండల అధికారులు ,జిల్లా అధికారులు, స్పందించి తనకు న్యాయం చేయాలని అనంతయ్య అధికారులను కోరారు. ఈ విషయమై మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్నానని, నాపై దయ ఉంచి జిల్లా , మరియు మండల అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..
Admin
Abhi9 News