Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని ఎర్రవల్లి మండలం దర్మవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ... ఇది సీఎం శ్రీ కేసీఆర్ మరో చారిత్రక నిర్ణయమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించేందుకు 'సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించారని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించి, వారితో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది... కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,పిఎసియస్ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు,ప్రజాప్రతినిధులు, ఎంఈఓ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News