Monday, 05 January 2026 04:32:47 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అంతే సంగతులు.. తాట తీస్తున్న పోలీసులు!

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ప్రత్యేక స్పెషల్

Date : 20 December 2025 06:03 PM Views : 49

Abhi9 News - తెలంగాణ / Hyderabad : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. వారం రోజులపాటు ముందస్తు నిఘా, గూఢచర్య సమాచారంతో పాటు మఫ్టీ పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 66 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వారం రోజుల వ్యవధిలో మఫ్టీలో 137 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఐటీ కారిడార్ పరిధిలోని రాత్రి వేళల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ ఉద్యోగులు, మహిళలు, యువత భద్రతకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న చర్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ల ద్వారా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 17 మంది ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో కుటుంబ కలహాల నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్న 22 కుటుంబాల్లోని భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్న చిన్న కారణాలతో కుటుంబాల్లో తలెత్తుతున్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూడటమే లక్ష్యంగా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పరస్పర అవగాహన, సహనం పెంచుకోవాలని, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యత దృష్ట్యా ఇటువంటి స్పెషల్ డ్రైవ్‌లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి సమాచారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :