Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధి లోని తిరుమల హిల్స్ లో ప్రతిభ విద్యాసంస్థలు వారి మహంతి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుధ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మహబూబ్ నగర్ కు ఎలాంటి వనరులు లేవని మనకు ఉన్న ఏకైక వనరులు మన జ్ఞానమే అని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం మాకే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉందన్నారు. అందుకే మన మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాలను బహుమతి గా ఇచ్చారన్నారు. మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలనే ఆలోచన ఎమ్మెల్యే లకే కాదు సామాన్య పౌరుడికీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అకుంఠిత దీక్షతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని ఆయన చెప్పారు. మన ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. మన మహబూబ్ నగర్ పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు కళలు, సాహిత్యం, క్రీడలు లలో మన మహబూబ్ నగర్ పిల్లలు రాణించాలని ఆయన అన్నారు. ప్రతిభా జూనియర్ కళాశాల విద్యార్థిని మంజుశ్రీ నీట్ ఎంట్రెన్స్ నందు ఆల్ ఇండియా లో 1902 ర్యాంకు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించి అభినందించారు. అంతకుముందు జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ చదువు మీద ప్రత్యేక శ్రద్ధను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు చూపిస్తున్నారని, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒప్పించి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటి కళాశాల రావడానికి ప్రధాన భూమిక పోషించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ , ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజి మొగ్గ నర్సింహులు, మహతి పాఠశాల చైర్మన్ మంజుల దేవి, డైరెక్టర్లు వేంకటేశ్వర రెడ్డి, జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News