Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహిళా పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ నందు నమోదు అయిన కేసు నెం. 58/2021 U/s 498-A IPC విచారణ అనంతరం నేడు 17.06.2025న కేసు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు కవలి శ్రీనివాసులు s/o కవలి పెంటయ్య, వయసు: 30 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: ఆటో డ్రైవర్, కారూర్ గ్రామం, నవాబ్‌పేట్ మండలం, గారిని ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.2,000/- జరిమానా విధిస్తూ, గౌరవనీయ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు, మహబూబ్‌నగర్ వారు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో విచారణాధికారి (I.O)గా పనిచేసిన ఎస్.సుజాతా, WSI WPS మరియు ప్రస్తుత ఎస్‌హెచ్ఓ పి. శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మహిళా పోలీస్ స్టేషన్, తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు అభినందించారు. అదేవిధంగా, కేసును విజయవంతంగా న్యాయస్థానంలో నిలబెట్టిన APP N.బాబు రావు మరియు CDO హెడ్కానిస్టేబుల్ అబ్దుల్ ముజీబ్ HC 860 ను కూడా జిల్లా ఎస్పీ గారు ప్రశంసించారు. మహిళల రక్షణకు కట్టుబడి ఉన్న పోలీసులు న్యాయాన్ని నిర్ధారించడానికి ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి నిలుస్తారు అని ఎస్పీ గారు తెలిపారు. జిల్లా ప్రజలు మహిళలపై జరుగుతున్న హింసను నిర్బంధించేందుకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరడమైనది.
Admin
Abhi9 News