Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్...ఈ సందర్భంగా జియంఆర్ గారు మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుల అవినీతి విధానాలను ఖండిస్తూ, వారి వైఫల్యాలను ఎండగడుతూ పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నిన్న పాలమూరుకు నీళ్లు ఇచ్చామని హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటే, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రజలకు గణాంకాలతో సహా వాస్తవాలకు తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది. వాస్తవాలు మాట్లాడితే భూజాలు తడుముకుని, హౌలా వెంకటేశ్వర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో కల్లు తాగిన కోతిలా మాట్లాడారు. ఆల వెంకటేశ్వర్ రెడ్డి- హరీష్ రావు లు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్ట్ వర్క్ లలో వ్యాపార భాగస్వాములు. హరీష్ రావు ఏడుసార్లు గెలిచినంత మాత్రాన, పాడింది పాటగా అబద్ధాలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకపోగా, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు ఆధారాలతో సహా మాట్లాడితే, దానికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తే భయపడే వారు ఎవ్వరు లేరు. మీరు చేసింది ఒక తప్పు కాదు, 100 తప్పులు, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్కో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వందల ఎకరాలు, వేలకోట్లు దోచుకున్నారు. బిఆర్ఎస్ దోపిడీని ప్రశ్నిస్తే, హీనాతి హీనంగా, ప్రెస్ మీట్ కు తాగొచ్చినోడిలా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడిండు. బిడ్డ అలా వెంకటేశ్వర్ రెడ్డి 2014 ముందు నీ ఆస్తులన్నీ.. ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని..? నీకు జూబ్లీహిల్స్ బంగ్లా... హైవే వెంబడి వేల ఎకరాల భూములు నీకు ఎక్కడి నుండి వచ్చినాయి. బిడ్డ వేంకటేశ్వర్ రెడ్డి ఖబడ్దార్, నీ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు... నిస్వార్ధంగా ప్రజలకు సేవచేస్తున్న మాపై అడ్డగోలుగా మాట్లాడితే తాటా తీస్తాం. తెలంగాణ ఉద్యమ ముసుగులో రెండుసార్లు గఫ్లాత్ లో ఎమ్మెల్యేగా గెలిచింది నువ్వు, ప్రజల సమస్యలపై పోరాటం చేసి, మిమ్మల్ని సవాల్ చేసి, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచా. ఒక్క ఓటుతో గెలిచిన గెలుపు..గెలుపే, మీ చిన్న దొర కేటీఆర్ 2009 లో మొదటిసారి ఎమ్మెల్యేగా 171 ఒక్క ఓట్లతో గెలిచాడు. అయినా మీ కేటీఆర్, మీ హరీష్ రావు లకు ఏమ్ అర్హత ఉందని... దేశం కోసం ప్రధానమంత్రి పదవితో పాటు ఆస్తులను అర్పించిన త్యాగధనుల కుటుంబానికి చెందిన ఇందిరా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తారు..? హరీష్ రావు ఏడు సార్లు గెలిస్తే ఏంటి...పది సార్లు గెలిస్తే ఏంటి.. ఎమ్మెల్యేగా నాకు ప్రశ్నించే హక్కు ఉంది.. నాకే కాదు, మా సామాన్య కార్యకర్తలు కూడా కేటీఆర్, హరీష్ రావు, కెసిఆర్ లను విమర్శించే హక్కు ఉంది. హరీష్ రావు, కేటీఆర్ లను మేము కాదు సొంత చెల్లె కవిత దయ్యాలుగా అభివర్ణించింది. రబ్బర్ చెప్పులతో తిరిగే హరీష్ రావుకు 2000 ఎకరాల భూమి, వేలకోట్ల ఆస్తులు, విదేశాల్లో వ్యాపారాలు ఎలా వచ్చాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకో అనడానికి కేటీఆర్ ఎవడు... నిజానికి ఆత్మహత్య చేసుకోవాల్సిందే కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ లతో భార్యాభర్తల సంభాషణలు విని, సంసారాలు కూల్చారు, వేల కోట్లు దోచుకున్నారు, తెలంగాణను బ్రష్టు పట్టించారు. మా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి, తెలంగాణను ఫాలో అవుతున్నాయి. కల్వకుర్తి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎప్పడు ఎత్తిపోయాలో మాకు తెలుసు, కల్వకుర్తి పంపులు ప్రతి ఏటా జులై చివరిలో లేదా ఆగస్టు ఒకటో తేదీన స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందించే ఆనవాయితీ ఉంది, ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా అదే సమయంలో నీళ్లు ఇస్తాం. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం, అధికారుల అభిప్రాయాలను గౌరవిస్తాము, మీలా అధికారులను పక్కాకు పెట్టి, మేమే మేధావులమని చెప్పుకోం, మీరు మేధావులు కట్టిన కాలేశ్వరం కూలిపోయింది. పాలమూరు- రంగారెడ్డి 90 శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధాలు మాట్లాడుతున్నారు. మూడేళ్లలో పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేస్తామన్నారు, కానీ పాలమూరు- రంగారెడ్డి తర్వాత ప్రారంభమైన కాలేశ్వరం పూర్తయిన ఆనాడు కెసిఆర్ ను ప్రశ్నించని దద్దమ్మ ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఆనాడు కోయిల్ సాగర్ కు వచ్చిన హరీష్ రావు, కోయిల్ సాగర్ ఆయకట్టును పెంచి 50 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, ఐదు ఎకరాలకు కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఐవిఆర్ సెల్ కంపెనీతో, కోయిల్ సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేయించలేని సన్యాసి మాజీ ఎమ్మెల్యే. కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, యాసంగి లో చరిత్రలో మొదటిసారి కోయిల్ సాగర్ కు నీళ్లు తీసుకోవచ్చం. మీ పాలనలో కోయిల్ సాగర్ కు కూతవేటు దూరంలో ఉన్న అడివి అజిలాపూర్ కు నీళ్లు ఇవ్వలేదు. పదేళ్లు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్, ఒక జూనియర్ కాలేజ్, ఒక్క హాస్పటల్ ను నిర్మించిన పాపాన పోలేదు, దేవరకద్ర నియోజకవర్గాన్ని మునిసిపాలిటీ చేయలే, కోర్టు ఏర్పాటు చేయలే. కానీ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో భూత్పూర్, అడ్డాకుల్ మూసాపేట్ మండలాలలో వేల కోట్ల విలువైన నల్ల మట్టిని దోచుకున్న దొంగవు నువ్వు. నీ కారణంగా దేవరకద్ర రెండుగా చీలింది, రైల్వే అధికారులను కలిసి అండర్ ప్లస్ వేయాల్సిన చోట, నీ కమిషన్ల కక్కుర్తికి దేవరకద్రలో ఫ్లైఓవర్ కట్టి దేవరకద్రను బ్రష్టు పట్టించావ్. నువ్వు కట్టిన చెక్ డ్యామ్ లు అన్ని నాసిరకంగా ఉన్నాయి, నువ్వు కట్టిన సంవత్సరానికే అల్లిపూర్ చెక్ డ్యామ్ లీకేజీలు వచ్చాయ్. నువ్వు ఎంత పెద్ద అవినీతి పరుడవో..నియోజకవర్గ ప్రజలకు తెలుసు..బిడ్డ మాట్లాడం నేర్చుకో. మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందంటూ..ఏదేదో భ్రమలో ఉన్నావ్, నిన్ను ఎప్పుడో నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారు. కాలువలకు భూసేకరణ చేయకుండా పాలమూరు - రంగారెడ్డి నిర్మించారు, మీరు ప్రారంభించిన ఒక్క మోటార్ నీళ్లు వెళ్లే దారి లేక గంటకే ఆఫ్ చేశారు. కాలువలు నిర్మించకుండా ప్రాజెక్టులు కడితే నీళ్లు ఎట్లా పోతాయి. పదేళ్లు ఎమ్మెల్యేగా నువ్వు చేయలేని పనులు, నేను 18 నెలల కాలంలో చేశా, 18 నెలలలో నియోజకవర్గానికి 500 కోట్ల నిధులు నియోజకవర్గానికి తీసుకువచ్చా. చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద 110 కోట్లతో ఎలివేటేర్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ వంతెన. 72 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ లు, 35 కోట్లతో దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, 5 కోట్లతో కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి. అడివి అజిలాపూర్ లిఫ్ట్ కు 35 కోట్లు, 34 లక్షల నిధులతో కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద మంచినీటి పరిష్కారం కోసం ట్యాంకుల నిర్మాణం, కోయిల్ సాగర్ టూరిజం డెవలప్మెంట్ కు 3 కోట్ల నిధులు. దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో డిగ్రీ కాలేజ్, కోర్ట్, దేవరకద్ర మున్సిపాలిటీ మరియు చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఇంటర్ కాలేజ్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో రోడ్లు వేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. త్వరలో దేవరకద్ర నియోజకవర్గంలో సర్కిల్ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఏర్పాటు చేయబోతున్నాం. నాసిరకం చెక్ డ్యామ్ లా గురించి తప్ప నియోజకవర్గంలో నువ్వు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు. అబద్ధాలు మాట్లాడితే హరీష్ రావు గురించే కాదు ఎవరైనా నిలదీస్తాం.. ఎవరినైనా ఎదురిస్తాం.
Admin
Abhi9 News