Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మహబూబ్నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్ అన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం. చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని చూసి భయపడి కేంద్ర ప్రభుత్వం ఎంపీ సభ్యత్వానికి అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రతో ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీని ఏమి చేయలేరని, వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హక్, కురువ నరేష్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, ఐఎన్పియుసి జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ , నాయకులు రమేష్ నాయక్, శంసుద్దీన్ , నరేష్ గౌడ్ శివశంకర్ గౌడ్, తాహెర్, శేఖర్ యాదవ్, జాకీర్, రమేష్, నరేష్ బాబు, చంద్రమౌళి, జగదీష్, కావాలి గోపాల్, అబ్దుల్ రజాక్, అలీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News