Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట, న్యూస్టుడే: పేట పట్టణం లోని జీషాన్, హిమాలయ రెస్టారెంట్లపై శుక్ర వారం రాత్రి ఆకస్మిక దాడులు చేసి పురపాలక అధికారులు ఆహార పదార్థాలను పరిశీలించారు. స్థానిక జీషాన్ రెస్టారెంట్లలో చికెన్, మటన్, చేపల మాంసంలకు ఎలాంటి పరిమితి గడువు లేకుండా ఫ్రిజ్లో ఉంచారు. అలాగే తాజా చికెన్, మటన్ మాంసంలను ఫ్రిజ్లో నిల్వ చేశారు. స్థానిక హిమాలయ రెస్టారెంట్లో పరిశీలన బెట్టి కాల్చిన చికెన్ ఫ్రిజ్లో ఉన్నట్లు గుర్తించారు. అదే మాంసం ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. సీజ్ చేసి మాంసాన్ని హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రెస్టారెంట్పై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్, కమిషనర్, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Abhi9 News