Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల మదిగట్ల గ్రామాల్లో గత రెండు రోజులుగా విద్యుత్ చౌర్య నిరోధక విద్యుత్ శాఖ డి పి ఈ అంబిక ఎస్సై మోహన్ కలిసి దాడులు నిర్వహించారు, అనంతరం గోపులాపూర్ గ్రామంలో రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు, ఆ గ్రామ రైతులు కిషన్ జామిని ,కమలను విచారణ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు, మేము డీడీలు చెల్లించిన కాంట్రాక్టర్ వెంకటమ్మ, విద్యు త్ శాఖ ఇంజనీర్ కలిసి రూపాయలు 30,000 లంచం డిమాండ్ చేశారని, 6000 అడ్వాన్స్ కూడా చెల్లించామని వారు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు, అలాగే భూత్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా అనుమతులు లేకుండా లయన్ షిఫ్టింగ్ పనులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు, తర్వాత తాటికొండ అన్న సాగర్ గ్రామాల్లో విద్యుత్ పనులను పరిశీలించారు ఈ అధికారులకు సెక్యూరిటీ అధికారిగా ఎస్సై మదన్మోహన్ శివ పాల్గొన్నారు
Admin
Abhi9 News