Monday, 05 January 2026 04:32:48 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. గన్ తో కాల్చుకుని ఘాతుకం..!

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. హయత్‌నగర్ పరిధిలోని తన నివాసంలో గన్‌తో కాల్చ

Date : 22 December 2025 10:04 AM Views : 50

Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. హయత్‌నగర్ పరిధిలోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై కృష్ణ చైతన్యను అత్యవసరంగా కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా వ్యక్తిగత కారణాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణ చైతన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని సమాచారం. స్వభావరీత్యా కృష్ణ చైతన్య ఎంతో మౌనంగా, అంతర్ముఖుడిగా ఉండేవారని, తన వ్యక్తిగత సమస్యలను ఎవరికీ చెప్పుకోని వ్యక్తిగా సహచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు తీవ్ర చికిత్స అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం కుటుంబ సమస్యల కారణంగా తీవ్రంగా మనస్తాపం చెందిన కృష్ణ చైతన్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అప్పట్లో ఆయన కనిపించకపోవడంతో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. ఆ సమయంలోనే ఆయన నరాల సంబంధిత సమస్యలు, ముఖ్యంగా మెదడులో రక్త గడ్డలు (బ్రెయిన్ క్లాట్స్) ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలిసింది. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ విధుల్లో మాత్రం ఆయన పూర్తిగా సాధారణంగానే ఉండి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :