Saturday, 18 April 2026 05:20:39 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు.. సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ సీరియస్ డైరెక్షన్స్‌

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ స్పీడందుకుంది. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వ

Date : 22 December 2025 09:19 AM Views : 163

Abhi9 News - తెలంగాణ / Hyderabad : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ స్పీడందుకుంది. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందర్నీ ప్రశ్నించాలని సిట్‌కు డైరెక్షన్స్‌ ఇచ్చారు. దీంతో పోలీసుల ప్రత్యేక అధికారుల బృందం రంగంలో దిగింది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. వైడ్‌ యాంగిల్‌ ఎంక్వయిరీ చేపట్టింది. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో 9మంది సిట్‌ అధికారులతో సమావేశమయ్యారు సీపీ సజ్జనార్‌ .ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసుతో సంబంధం వున్న అందర్నీ ప్రశ్నించాలన్నారు.ఇక రాజకీయ నేతలు,అధికారులను విచారించనుంది సిట్‌. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావువిచారణ కొనసాగుతోంది. శనివారం జూబ్లీ హిల్స్‌ పీఎస్‌లో ఆయన్ని ప్రశ్నించారు సిట్‌ అధికారులు. ఇప్పటి వరకు ఏసీపీ,డీసీపీ, జాయింట్‌ సీపీ స్థాయి ఆఫీసర్లు విచారణలో పాల్గొన్నారు. ఐతే సోమవారం సీపీ సజ్జనార్‌ స్వయంగా ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇకఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జూబ్లీహల్స్‌ పీఎస్‌లోనే ఎంక్వయిరీ జరుగుతుంది.త్వరలో సిట్‌కు ప్రత్యేక కార్యాలయం కేటాయించనున్నారని సమాచారం. ఇప్పటివరకు సాగిన దర్యాప్తులో అధికారులు పలుహార్ డిస్క్‌లుతో పాటు ఎలక్ట్రానిక్ డివైస్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ప్రభాకర్ రావు కి చెందిన ఫోన్లు లాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించి డేటాను విశ్లేషిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు..? ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి…? రికార్డ్ చేసిన డేటాను ఎక్కడైనా భద్రపరిచారా? లేదంటే ధ్వంసం చేశారా …? అనే అంశాలపై సిట్ అధికారులు ఫోకస్‌ పెట్టారు.ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే, కొత్త సిట్ జరిపే విచారణ మరో ఎత్తు. కొత్త సిట్ లో ఐపీఎస్ అధికారులు ఉండటం… టెలిఫోన్ టాపింగ్ నిబంధనల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో మెరికల్లాంటి అధికారులను సిట్ లో చేర్చారు. పూర్తి చార్జషీట్‌ దాఖలు చేయాలని సిట్‌కు డైరెక్షన్‌ ఇచ్చిన సీపీ సజ్జనార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం వున్న అందర్నీ ప్రశ్నించాలని క్లియర్‌ కట్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :