Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : నేడు జరగనున్న రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాలలో గెలిపించాలని జనరల్ స్థానాలలో మొదటి విడత ఎన్నికల్లో ఏ విధంగా అయితే అత్యధిక స్థానాలు గెలిచారో అదే విధంగా ఈ విడతలో కూడా అత్యధికంగా సర్పంచులుగా గెలిచి బీసీల సత్తా ఏంటో నిరూపించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలో కోరారు. అన్ని పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి మోసం చేసిన ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని, భవిష్యత్తులో జరగబోవు ఎంపీటీసీ ,జెడ్పిటిసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చే విధంగా ఈ ఎన్నికల్లో మన బలం నిరూపించుకోవాలని తెలిపారు. బీసీ వాదం ఉన్న వ్యక్తిని, అగ్రవర్ణాల ప్రోత్సాహం లేకుండా ఉన్న వారిని గెలిపించుకుంటే భవిష్యత్తు బీసీ ఉద్యమంలో రాజకీయంగా ముందుకు పోయేందుకు ఇప్పుడు గెలిచే సర్పంచులకు మంచి అవకాశమన్నారు. తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లందరూ చైతన్యంతో ఆత్మగౌరవ ఉద్యమంగా భావించి మన ఓట్లు మనకే వేసుకుని ఎక్కువ మందిని గెలిపించుకోవాలని శ్రీనివాస్ సాగర్ కోరారు..
Admin
Abhi9 News