Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గతంలో అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహించామని... ఇప్పుడు అంతకంటే గొప్పగా ట్యాంక్ బండ్ వద్ద ఈనెల 23వ తేదీన సాయంత్రం 7 గంటలకు... 450 డ్రోన్లతో మెగా డ్రోన్ షో ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ డ్రోన్ షో కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో సింగపూర్, అమెరికా దేశాల్లో ఇలాంటి డ్రోన్ షో నిర్వహించారని ఇటీవలే సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా అద్భుతమైన డ్రోన్ షో ద్వారా చూపరులను కట్టిపడేసేలా డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజలంతా తరలివచ్చి అద్భుతమైన ఈ డ్రోన్ షో తిలకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ పర్యాటక క్షేత్రాలు, ముఖ్యమైన ప్రదేశాలను డ్రోన్ షో లైటింగ్ ద్వారా వీక్షించవచ్చన్నారు. మహబూబ్ నగర్ డ్రోన్ షో తర్వాత మిగతా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఈ ప్రదర్శన ఉండనుందని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డిసిసిబి ఇన్చార్జి చైర్మన్ కే వెంకటయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, కలెక్టర్ జి.రవినాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News