Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : వరుసగా దొంగతనాలు చేస్తున్న ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసినట్టు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే నరసింహ వెల్లడించారు. నేడు నిందితుడిని ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 11 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు సూర్యాపేట జిల్లాకు చెందిన తాయి ప్రశాంత్ గా గుర్తించినట్టు పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతని గుర్తించి స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారిస్తే నేరాలను ఒప్పుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిందితుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనీ లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్టు ఆయన వెల్లడించారు.
Admin
Abhi9 News