Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట కు నూతన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని పత్రిక సమక్షంగా ప్రకటించిన గౌరవ నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి. ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యార్థులు ఈ ప్రాంత విద్యార్థులు ఈ సంవత్సరం నుంచే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో చేరాలని పిలుపునిచ్చారు. మామూలుగా 20 సీట్లు మాత్రమే ఉండే కళాశాలలో గౌరవ శాసన సభ్యుల చోరువతో నారాయణపేట అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలకు 40 సీట్లను ఉండేవిధంగా ఒప్పించడం జరిగింది.ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి వర్యులు ధన్యవాదములు తెలిపారు.
Admin
Abhi9 News