Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జాతీయ న్యాయ సేవాధికర సంస్థ, హైదారాబాద్ వారి ఆదేశాల మేరకు తేదీ 14.06.2025 రోజున మహబూబ్ నగర్ జిల్లా లోని అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కోర్టులందు పెండింగ్ లో ఉన్న కేసులు కానీ ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ పరిష్కరించుకునే/రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్, లోక్ అదాలత్ కేసు దాఖలు చేసినప్పుడుకోర్టు రుసుము చెల్లంచాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోక్ అదలాట్లు పంపబడి, ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే, వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు మరియు ఇరు వర్గాలు గెలిచినట్టే, ఈ లోక్ అదాలత్ l ద్వారా సమయం మరియుడబ్బు వృధా కాకుండా ఉంటుంది మరియు లోక్ అదాలత్ తీర్పుతో ఇరు పక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి పడ దగ్గ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాద కేసులు, డబ్బు రికవారికి సంభందించిన కేసులు, మోటర్ వెహికల్ యక్షిడెంట్ కేసులు,చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, మరియు ప్రి లిటీగేషన్ కేసులను, ఈ పెట్టీ కేసులను , డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను,బ్యాంకు కేసులను మరియు బీఎస్ఎన్ఎల్ ప్రిలిటీగేషన్ కేసులను మరియు స్పెషల్ N.I Act కేసులను, ఇతర రాజీకి వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ( 08) బెంచిలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తారు. ఇప్పటికే 3010 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేసినారు. ఇన్స్యూరెన్స్ కంపనీలు,పోలీసు శాఖతో బ్యాంకు మేనేజర్లతో పలు సమావేశాలు నిర్వహించినారు. ఇదివరకు నిర్వహించిన లోక్ అదాలత్ లో జిల్లాలో 17431 కేసులు రాజీ చేయడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్ తేదీ:14.06.2025 ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించబడుతున్నాయి. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరని ప్రకటనలో తేలియచేసినారు.
Admin
Abhi9 News