Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఎస్కార్ట్ డ్యూటీలు, భద్రతా ప్రామాణికాలు, సమన్వయంపై ప్రత్యేక దృష్టి, మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు మల్టీ జోన్-II ఐజీ సత్యనారాయణ, ఐపీఎస్ గారు మరియు జోగుళాంబ జోన్-VII, DIG శ్రీ ఎల్.ఎస్.చౌహాన్, ఐపీఎస్ గారి సమన్వయంతో, జోగుళాంబ జోన్-VII పరిధిలోని జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత జిల్లాల జిల్లా పోలీసు అధికారి (SP)లు, L &O డీఎస్పీలు, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఖైదీల ఎస్కార్ట్ డ్యూటీల నిర్వహణ, భద్రతా చర్యలు, జైలు మరియు కోర్టు మధ్య సమన్వయం, అనుమానాస్పద కార్యకలాపాల పర్యవేక్షణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.విచారణలో ఉన్న ఖైదీలు (Under Trial Prisoners) మరియు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను (Convicted Prisoners) కోర్టులకు, ఆసుపత్రులకు తరలించే సమయంలో అవసరమైన/తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఖైదీల ఎస్కార్ట్ డ్యూటీల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది ఖైదీల పూర్వ చరిత్ర (Criminal History), జైలు నందు వారి ప్రవర్తన అంశాలను ముందుగానే తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి.ఖైదీలను తరలించే రూట్, వాహనాలు, మారుతున్న పరిస్థితుల ఆధారంగా తగిన భద్రతా ప్రణాళికలు రూపొందించాలి.జైలు అధికారులు, కోర్టు అధికారులు, వైద్య సిబ్బందితో సమన్వయం కలిగి వ్యవహరించాలి. ఏ చిన్న నిర్లక్ష్యం కూడా సెక్యూరిటీ బ్రీచ్ కు దారితీయవచ్చు.ఖైదీలను హాస్పిటల్ కు తీసుకెళ్లే సమయంలో వారు పారిపోవడానికి లేదా బయట సంబంధాలు కలుపుకునే అవకాశాలు ఉన్నాయని భావించి అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, మహిళలు, మైనర్లు మరియు వృద్ధులను తరలించే విషయంలో అవసరo మేరకు జాగ్రత్తలు తీసుకునేలా SOP ని రూపొందించడం జరిగింది. "ఎస్కార్ట్ డ్యూటీ అనేది అత్యంత బాధ్యత కలిగిన, భద్రతా పద్ధతులతో నడిపించాల్సిన ప్రత్యేక విధి. ఖైదీ తప్పించుకుంటే అది పోలీస్ వ్యవస్థపై మచ్చగా మిగులుతుంది," అని ఆయన హెచ్చరించారు. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ప్రతి ఖైదీకి రిస్క్ ప్రొఫైల్ రూపొందించి, అతనిపై ఎలా పర్యవేక్షణ కొనసాగించాలన్న దానిపై వివరణాత్మక వ్యూహం తయారుచేయాలని సూచించారు.
Admin
Abhi9 News