Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ బీసీ మహాసభ మరియు శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీస్సి మరియు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో మీకు ఇష్టం ఉన్న కోర్సులను ఎన్నుకోవడం వల్ల విద్యార్థుల కలలు సాకారం అవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రయివేట్ కళాశాలల్లో కూడా ఉచిత విద్య ను అందేలా ప్రభుత్వమే రియంబర్స్ మెంట్ అందజేయాలని, ఉచిత విద్యా, వైద్యం అందించే భాద్యత ప్రభుత్వం పై భాధ్యత ఉందన్నారు.ప్రతి యేటా రెగ్యులర్ గా ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ వేయాలని, లైకజీలు లేని ఎగ్జామ్స్ నిర్వహించాలని, ఆయన అన్నారు.మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని వివిధ పాఠశాల మరియు కళాశాల లనుండి దాదాపు 400 మంది విద్యార్థులు వారి తల్లి తండ్రులు కలిపి 900 మంది హాజరయ్యారు. కార్యక్రమం లో తెలంగాణ బీ సి మహాసభ జిల్లా అధ్యక్షులు డా మెట్టుకాడి శ్యామ్ సుందర్,లంబిని హై స్కూల్ అధినేత కే. లక్ష్మన్ గౌడ్,రామ్ శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి,శ్రీమతి డా.కృష్ణవేణి,గుళ్ళ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News