Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కొల్లాపూర్‌లో రాజకీయ కాక.. జూపల్లి రాకతో కాంగ్రెస్ లో మారిన సమీకరణలు ...

Date : 28 June 2023 06:46 PM Views : 264

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ కాక ఆరంభం అయ్యింది.అధికార బీఆర్ఎస్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య మొదటి నుంచి సాగుతూ వస్తున్న అంతర్యుద్ధం పరాకాష్టకు చేరడం.. ఆపై జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ తో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ అలజడి ఆరంభం అయ్యింది. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు సమావేశాలు నిర్వహించడంతోపాటు రాజకీయ నిపుణులు, శ్రేయోభిలాషుల అభిప్రాయాలను సేకరించి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ రాజకీయాలలో ఒక్కసారిగా కాక మొదలైంది. అధికార బీ ఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్, ఇతర పార్టీలలోనూ అలజడులు చెలరేగుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ సాధించుకున్న జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల ఎన్నికలలో తన సత్తా చాటుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్టు తనకే వస్తుందన్న ఆశతో ఉన్న జూపల్లి కృష్ణారావుకు టికెట్ దక్కదు అన్న విషయం తేలడంతో అభిమానులు, శ్రేయోభిలాషుల సలహాలు సూచనలతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం.. ఆ మేరకు పీసీసీ అధినేతలను కలవడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం చకచక జరిగిపోయాయి. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని జూపల్లి, ఆయన అనుచర వర్గం కలవడం ఒక్కసారిగా అలజడి రేపింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ బాహుబలి చూస్తూ వస్తున్న నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ వస్తున్న అభిలాష్ రావు, జగదీశ్వరరావు పార్టీ ప్రయోజనాల కోసం తమ వంతు పాత్రను నిర్వహించారు. రెండున్నర సంవత్సరాల క్రితం భారీ బహిరంగ సభను కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చూపులు కృష్ణారావు అభిమానులు, శ్రేయోభిలాషులు సూచించినట్లుగానే కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టారు .వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం గతంలోని నాకు హామీ ఇచ్చింది. పైగా అధిష్టానం నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్టు ఇస్తామని హామీ ఇచ్చారు అని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న జగదీశ్వరరావు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు లేకుండా పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించేందుకు తగిన చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రంగంలోకి విష్ణువర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్‌ను వీడి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరెందుకు రంగం సిద్ధం అవుతుంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడం కష్టతరం అవుతుందన్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. దీర్ఘ కాలం పాటు ఆయా పార్టీలకు సేవలు అందించిన విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి కి టికెట్ ఇస్తే గెలుపు కష్టం అని, ముఖ్యమైన వారికి అవకాశాలు కల్పిస్తే ప్రయోజనాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :