Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ కే. లోక్ నాథ్ రెడ్డి అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ సిబ్బంది, అధికారులు, ప్రజలతో కలిసి గాంధీ చౌక్ వరకు బోనాలు, బతుకమ్మలు, బ్యాండ్ బాజాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండటానికి కారణం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తో పాటు సఫాయి కార్మికులు, మున్సిపల్ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. అందుకే ఈరోజు కమాటి, స్వీపర్ లకు పాదాలు కడిగి పాదపూజ ప్రస్తుత పరిస్థితి కు అనుగుణంగా మార్పులు చేతులు చేసి 2019 కొత్త చట్టం తీసుకురావడం జరిగింది అన్నారు. కొత్త చట్టం వచ్చాక ప్రజలకు రోజువారి అవసరాలకు ఎలాంటి మౌలిక అవసరాలు ఉంటాయో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్తు పారిశుధ్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిత్యవసర వస్తువులు, కూరగాయలు ఒకే చోట సమీకృత మార్కెట్లో నాణ్యమైనవి దొరికే విధంగా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అయి సకాలంలో ఇతర పనుల పై దృష్టి సారించేందుకు వీలు దొరుకుతుందన్నారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.ప్లాస్టిక్ ను వాడకుండా వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఉదయాన్నే చెత్త సేకరణకు వచ్చే కార్మికులకు రాబోయే కాలంలో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి పట్టణంలో ప్రస్తుతం సాధించిన అభివృద్ధి, గత ప్రభుత్వం లో ఉన్న తేడా పై స్పష్టత ఇచ్చారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి వనపర్తి పట్టణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.అనంతరం మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సఫాయన్నా - సలామన్న అని వల్లయ్య, కామాటి, చంద్రమ్మ స్వీపర్ లను పాద పూజ చేసి సన్మానం చేశారు. పొద్దు ఎల్లక ముందే విధులగుండా రోడ్లు ఉడుస్తు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు అని సలాం చేశారు.ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది సఫాయి కర్మచారిలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News