Abhi9 News - క్రైమ్ వార్తలు / అనకాపల్లి : కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 18 మంది సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడినట్లు స్థానికులు తెలిపారు. మంటల్లో మరో 15 మంది వరకు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ప్రాంతంలో గతంలోనూ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
Admin
Abhi9 News