Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ట్రాక్టర్ టైర్ పేలి ట్రాక్టర్ దగ్ధం అవడంతో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం సమీపంలో డ్రిల్లింగ్ ట్రాక్టర్ హాజీపూర్ గ్రామం నుండి పదర గ్రామానికి డ్రిల్లింగ్ చేయడానికి వెళ్తుండగా మార్గమధ్యలోఒక్కసారిగా ట్రాక్టర్ టైరు పేలి ట్రాక్టర్ నుండి పొగలు వెలువడి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన 108 అంబులెన్స్ సహాయంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.భారీ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వున్న వ్యవసాయదారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేసి దర్యాప్తు చేస్తామన్నారు.ఇద్దరు కూడా హాజీపూర్ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. దీంతో హాజీపూర్ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి
Admin
Abhi9 News