Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు వ్రాత పరీక్షా నందు అర్హత పొందిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రెండవ రోజు ప్రారంభం కాగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నరసింహ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. జిల్లా పరిధిలో మొత్తం 500 మంది అభ్యర్థులకు గాను 434 మంది అభ్యర్థులు హజరైనారు 434 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగినదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమములో అదనపు ఎస్ పి రాములు, ఏ.ఓ రుక్మిణి బాయి, సాయుధ దళ డి.ఎస్పీ శ్రీ శ్రీనివాసులు, సుపెరిండెంట్ యెహోవా దాస్, ఐటీ సెల్ సిబ్బంది, పరిపాలన విభాగం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.
Admin
Abhi9 News