Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఏడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాల నుండి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.జిల్లా ఎస్పీ. ఎన్ వెంకటేశ్వర్లు

Date : 20 July 2023 02:03 PM Views : 327

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : రాష్ట్రవ్యాప్తంగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ముసురు వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న నివాసలలో ఉండే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని ఎస్పీ. ఎన్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న ముసురు వర్షాల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లతో చేపట్టవలసిన చర్యల గురించి జిల్లా ఎస్పీ వైర్లెస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు జరిచేయడం జరిగింది. జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తునందు వల్ల ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రోడ్లపై వెళ్లే ప్రయాణికులు సాహసాలు చేసి ప్రమాదాలకు గురికావొద్దని,ఆయా ప్రాంతాలలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. జిల్లాలో 24 గంటల పాటు పెట్రో కార్స్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని, కృష్ణానది తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నది దగ్గరకు ఈతలకు వెళ్ళరాదని, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి వెళ్లరాదని ఎస్పీ గారు సూచించారు. గ్రామాలలో చెరువులు అలుగుల వద్ద పెద్దలు తమ పిల్లలను నదులలోకి, అలుగుల వద్దకు వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని, వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు సిబ్బంది తమ వెంట ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు రోప్స్, టార్చ్ లైట్స్, ట్యూబ్స్, లైవ్ జాకెట్స్ వెంట ఉంచుకోవాలని ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ గారు పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు ఆదేశించారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాల పై ప్రజలను జాగృతం చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా , రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంబంధిత గ్రామాల సర్పంచ్ లను, మరియు ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు అక్కడి సిచువేషన్ అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్దంగా వుండాలని గ్రామ పోలీసు అధికారులకు సూచించారు.వర్షాలలో విద్యుత్ స్థంబాలకు ఎర్థింగ్ ద్వారా విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉందని జిల్లా ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా వారిని జాగృతం చేయాలని ,అలాగే విధ్యుత్ సరఫరా లో ఏదైనా లోపం ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. బారి వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్- 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 70399 నెంబర్లకు సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :