Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఈనెల 30 న కొల్లాపూర్ లో ప్రియాంకా గాంధీ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా వెల్లడించారు...మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోనీ ఓ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈనెల 30 న పాలమూర్ ప్రజాగర్జన పేరుతో కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు... ఈ సభకి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపూ 3 లక్షల జనాభ వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు...మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఅర్ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఈ సభా జరగబోతుందనీ తెలిపారు... ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ... ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఎన్నడు జరగని విధంగా ఈ సభ జరగబోతుందనీ వెల్లడించారు...కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
Admin
Abhi9 News