Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రతిరోజు టీ-హబ్ కు వచ్చే నమూనాల వివరాలు, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల కు వచ్చే ఔట్ పేషెంట్ల వివరాలను సమర్పించాలి

Date : 25 July 2023 07:03 PM Views : 313

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రతిరోజు టీ-హబ్ కు వచ్చే నమూనాల వివరాలు, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల కు వచ్చే ఔట్ పేషెంట్ల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. మంగళవారం అయన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని టీ-హాబ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్చార్జి నోడల్ పర్సన్ తో మాట్లాడుతూ ప్రతిరోజు ఎన్ని శ్యాంపిల్లు టీ-హబ్ కు వస్తున్నాయని, శాంపిళ్ల ఫలితాలు ఎప్పుడు పంపిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా శాంపిళ్లు వస్తున్నది, లేనిది ఆయన పరిశీలించారు. పి హెచ్ సి ,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ల కు వచ్చే అవుట్ పేషెంట్ల వివరాలను, అలాగే జ్వరాల కేసుల వివరాలను తనకు ప్రతి రోజు సమర్పించాలని, అంతేకాక ప్రతిరోజు టీ-హబ్ కు వచ్చే శాంపిల్ వివరాలను సైతం సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామయ్య బౌలిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది ఔట్ పేషంట్లు వస్తున్నారని, ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నారని అడిగారు. అంతేకాక చికిత్స నిమిత్తం వచ్చిన బాలేశ్వరి అనే మహిళతో మాట్లాడుతూ ప్రతిరోజు చూసే వైద్యానికి మంగళవారం చూసే వైద్యానికి ఏమైనా తేడా ఉందా అని అడగగా, బాలేశ్వరి మాట్లాడుతూ మంగళవారం కేవలం మహిళలకు మాత్రమే చికిత్స అందిస్తారని , పరీక్షించే వారందరూ మహిళలే ఉంటారని, అందువల్ల తాను మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగిందని వివరించారు. ప్రతి రోజు పట్టణ ఆరోగ్య కేంద్రానికి వందమంది వస్తున్నారని, పట్టణ ఆరోగ్య కేంద్రం పి ఓ శ్వేత, మెడికల్ అధికారి గౌతమీలు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం ద్వారా అందించే వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో మాట్లాడారు. ప్రతి మంగళవారం కేవలం మహిళలకు మాత్రమే వైద్య సేవలు అందించే విషయాన్ని విస్తృతంగా తెలియ చేయాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లతో ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించుకునే ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి కలెక్టర్ సూచించారు. డిఎంహెచ్ ఓ డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్,డిప్యూటీ ఆర్ ఎం ఓ డాక్టర్ జీవన్ ,టీ -హబ్ ఇన్చార్జ్ డాక్టర్ ప్రగతి, రామయ్య భౌతి ప్రోగ్రాం ఆఫీసర్ శ్వేత, మెడికల్ ఆఫీసర్ గౌతమి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :