Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ గ్రామం లోని జడ్.పి.ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు.జడ్.పి. ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు..ఆహార పదార్థాలు మెనూ పరిశీలించారు విద్యార్థుల హాజరు శాతం గురించి ప్రదానో పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తరగతి గదిలో సాంఘిక శాస్త్రం బోధన చేస్తున్నారు బోర్డు పైన ఇండియా మ్యాప్ లో ఉత్తర దిశలో రాష్ట్రాలు గురించి విద్యార్థులన ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు,విద్యార్థులు విద్యార్థినులతో పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో వారు భవిష్యత్ లో ఏ రంగం లో స్థిరపడాలని అనుకుంటున్నారు అని అడిగారు. తెలుగు భాష చదవడం రాయడం తో.పాటు హిందీ,ఇంగ్లీష్ భాష లలో కూడా చదవడం,రాయడం నైపుణ్యం సంపాదించాలని సూచించారు.తప్పులు పోయిన బాగా ప్రాక్టీస్ చేయాలని,క్రమంగా పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు తర్వాత పిల్లలతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.డిజిటల్ (ఏ. ఐ) కంప్యూటర్ ల్యాబ్ బోధన గురించి కంప్యూటర్ లు బోధన గురించి తెలుసుకున్నారు. రోడ్డుకు అవతలి వైపు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రోడ్డు దాటి ఏ. ఐ.కంప్యూటర్ ల్యాబ్ కు రావడం ఇబ్బంది గా ఉందని కలెక్టర్ దృష్టికి ఉపాద్యాయులు తీసుకు వచ్చారు. జడ్.పి.ఉన్నత పాఠశాలల్లో ఉన్న 5 కంప్యూటర్ లలో రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అందచేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ తో పాటు జడ్.పి.ఉన్నత పాఠశాల హెచ్.ఎం.పి.కృష్ణయ్య తదితరులు ఉన్నారు
Admin
Abhi9 News