Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : మద్దూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ MD. యూనస్ గత సంవత్సరం డిసెంబర్ నెలలో అనారోగ్య కారణాలవల్ల మరణించగా వారి భార్య MD షాహినాస్ బేగం, కుమారుడు ఎండి ఇలియాస్ లకు విడో ఫండ్ కింద 10,000/- రూపాయల చెక్కును ఈ రోజు ఎస్పీ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి కుటుంబ స్థితి గతులను, పిల్లల విద్యా అభ్యసన మొదలగు వివరాలను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన పెన్షన్ మరియు ఉద్యోగం త్వరగా వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కౌముది, మరణించిన పోలీసు కుటుంబ సభ్యులు MD షహినాస్ బేగం, ఎండి ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News