Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి అంత్య క్రియల్లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళవారం సాయంత్రం దయాకర్రెడ్డి స్వగ్రామం సీసీకుంట మండలం పర్కాపురంలో జరగనున్న అంత్యక్రియల్లో పాల్గొని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు. కాగా, మాజీఎమ్మెల్యే దయాకర్ రెడ్డికి ఎన్టీఆర్, నారా కుటుంబంతోనూ సత్సంబంధాలు ఉన్నాయి
Admin
Abhi9 News